పురాణ ఘట్టాలకు సృజనాత్మకతను జోడించి ఎంతో హృద్య మంగా చినసత్యం రూపొందించిన నృత్యరూపకాలలో శ్రీకృష్ణపారి జాతం, శ్రీనివాస కళ్యాణం, రుక్మిణి కళ్యాణం, చండాలిక, అర్థనారీ శ్వరం, హరవిలాసం, రామాయణం, క్షీరసాగరమథనం, కిరాతార్జు నీయం రసజ్ఞుల ప్రశంసలు పొందాయి. దేశవిదేశాల్లో అసంఖ్యా కంగా ప్రదర్శనలిచ్చారు. 2011లో హైదరాబాద్‌లో 2800 మంది కళాకారులతో ఏకకాలంలో నిర్వహించిన అంతర్జాతీయ కూచిపూడి నృత్యకార్యక్రమంతో గిన్నీస్ రికార్డు నెలకొల్పారు. చినసత్యంగారికి ఆంధ్రవిశ్వవిద్యాలయం 1980లో గౌరవ డాక్టరేట్, కళాప్రపూర్ణ బిరుదు ప్రదానం చేయగా, భారతప్రభుత్వం 1998లో ' పద్మభూషణ్ 'తో సత్కరించింది. 'భరణి కళాప్రపూర్ణ' సహా నాట్యరంగంలో అందు కున్న పురస్కారాలు మరెన్నో. కూచిపూడి నృత్యమే తన శ్వాసగా జీవితాంతం శ్రమించి ఎందరో నర్తక, నర్తకీమణులను తయారుచేసి, ఆ నాట్యరీతికి భారతీయ నాట్యరీతుల్లో సముచితస్థానం ఆర్జించి పెట్టిన వెంపటి చినసత్యం సృృతి శాశ్వతం. ఆయన శిష్యకోటి ఆయన కృషికి సజీవ దర్పణాలు. కూచిపూడి నాట్యం సజీవంగా వున్నంతవరకు వెంపటి చినసత్యం చిరంజీవి.
-విశాలాంధ్ర దినపత్రిక సౌజన్యం తో .
No comments:
Post a Comment