తెలుగు భాష పరిరక్షణ ,అభివృద్ధి తదితర అంశాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద గల ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమం జరిగింది. ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగినఈ కార్యక్రమం తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ సామల రమేష్ బాబు అధ్యక్షతన జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రయ, ప్రముఖ కవి ఎస్వీ సత్యనారాయణ, రచయితలు కాలువ మల్లయ్య, తవ్వా ఓబుల్ రెడ్డి, తెలుగు భాషోద్యమకారులు, భాషాభిమానులు సింగా రావు, కోదండరామయ్య, పొట్లూరి హరికృష్ణ, అ.వీరాస్వామి, మహానందప్ప, భూదేవి, పలువురు తెలుగు భాషోద్యమకారులు పాల్గొన్నారు. తెలుభాష పరిరక్షణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేయాలని, తెలుగు అధికార భాషగా పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తెలుగు వ్యతిరేక ప్రభుత్వ విధానాల్ని నిరసించారు. అంతకు ముందు రోజు హైదరాబాదులోని హైదరాబాదు స్టడీ సర్కిల్ లో తెలుగు భాష పై చర్చా గోష్ఠి జరిగింది. "
తెలుగు పై చర్చాగోష్ఠి
తెలుగునుడి అపోహలు,వాస్తవాలు, పరిష్కారం " అనే అంశంపై ఈ చర్చా గోష్ఠి జరిగింది. నడుస్తున్న చరిత్ర మాస పత్రిక సంపాదకులు ,తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ సామల రమేష్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ చర్చాగోష్ఠిలో ప్రముఖ భాషా పరిశోధకులు ఆచార్య జయధీర్ తిరుమల రవు, మాజీ ఐపీ ఎస్ అధికారి " ఆర్ట్ అండ్ లెటర్స్" అధినేత చెన్నూరు ఆంజనేయ రెడ్డి, డాక్టర్ ధ్వానా శాస్త్రి , కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి, అచార్య విజయలక్ష్మి, సామల శివరామ కృష్ణ ,కె ఎల్ కామేశ్వరరావు, ఏకే ప్రభాకర్, ఎ.వీరాస్వామి, టి.మహానందప్ప , కోదండ రామయ్య, విజయగౌరి, గాయని భూదేవి, పొట్లూరి హరికృష్ణ పలువు తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment