Sunday, February 6, 2011

అంగరంగ వైభవంగా రెండో రోజు తెలుగు మహాసభలు

డిశా లోని బరంపురంలో అఖిల భారత ఆరవ తెలుగు మహాసభలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు శనివారం జరిగిన కార్యక్రమాల్లో తెలుగు సినీ ప్రముఖులు మురళీ మోహన్, సాయికుమార్ తదితరులు సందడి చేశారు. తెలుగు చరిత్ర-సంస్కృతి, కళలు, జర్నలిజం అంశాలపై జరిగిన సదస్సులు, ప్రముఖ అవధాని గరికపాటి నరసింహారావు అష్టావధానం దాదాపు మూడు గంటలు కొనసాగి ఆహూతులను ఆకట్టుకుం ది. సాహితీ సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలతో వైభవంగా సాగిన పండగను తెలుగు వారు మనసారా ఆస్వాదించారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ హనుమాండ్ల భూమయ్య ఆధ్వర్యంలో తెలుగు చరిత్ర-సంస్కృతి, లలి త కళలు, జర్నలిజం అంశాలపై జరిగిన సదస్సులు తెలుగు భాషాభిమానులను ఆకట్టుకున్నాయి. చరిత్ర-సంస్కృతి అంశం పై జరిగిన సదస్సులో ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు ప్రారంభ ఉపన్యాసం చేశారు. తెలుగు భాష, సంస్కృతుల గొప్పతనాన్ని వివరించారు. లలిత కళలపై జరిగిన సదస్సులో జానపద కళారూపాలు, హాస్యం, కూచిపూడి నృత్యం, సమకాలీన ఇతివృత్తాలు, తెలుగు, ఒడిశా జానపద కళలు, తదితర అంశాలపై విపులంగా చర్చిం చారు. సినీ గీతాల్లో తెలుగు భాషా సౌందర్యంపై హైదరాబాద్‌కు చెందిన ఎస్.వి.రామారావు చేసిన ప్రసంగం విజ్ఞానదాయకం గా సాగింది.
సదస్సుల్లో తెలుగు విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల అధిపతులు సిగిచర్ల కృష్ణారెడ్డి, ఆర్.చంద్రశేఖరరెడ్డి, డాక్టర్ ఎస్.ఉమాదేవి, కోట్ల హనుమంతరా వు, మునిరత్నం నాయుడు, రిజిస్ట్రార్ భట్టు రమేష్, రచయిత్రి డాక్టర్ చాగంటి తులసి తదితరులు ప్రసంగించారు. సాయంత్రం జరిగిన ప్రతినిధుల సదస్సులో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు మాట్లాడుతూ ఆయా రాష్ట్రాల్లో తెలుగు భాష అభివృద్ధికి సంబంధించిన సమస్యలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, డాక్టర్ ఎస్.రమేష్‌బాబు పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన సభలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్, నటుడు సాయికుమార్ ప్రసంగించారు. మహాసభలకు రాష్ట్ర మం త్రులు హాజరుకాకపోవడంపై మురళీమోహన్ తీవ్రంగా మండిపడ్డారు. రాత్రి జరిగిన ప్రత్యేక సినీ హాస్యవల్లరి కార్యక్రమంలో హస్యనటులు గీతాసింగ్, కొండవలస లక్ష్మణరావు, చిట్టిబాబు, కోట శంకరరావు తదితరులు తమ నటనతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం, హైదరాబాద్ రాజేశ్వరి బృందం ప్రదర్శిం చిన గీత గోవిందం, డాక్టర్ కోదండ రామ య్య పాడిన అన్నమయ్య కీర్తనలు, బరంపురానికి చెందిన కోలాటం ఆకర్షించా యి.
ఆదివారం సాయంత్రం జరగనున్న మహాసభల ముగింపు ఉత్సవాలకు ప్రముఖ సినీనటుడు డాక్టర్ కె.రాజేంద్రప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారని నిర్వాహక కమిటీ అధ్యక్షుడు టి.సత్యనారాయణ తెలి పారు. ముగింపు సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ సంగీత విభావరి ఏర్పాటు చేశామని చెప్పారు. భాషాసాహిత్యాలు, ఆధునిక సాహిత్యంలో ధోరణులు, సాహిత్యాంశాలపై సదస్సులు, కవి సమ్మేళనం జరుగుతాయని వివరించారు.
తెలుగు చరిత్ర, సంస్కృతిని స్పృశించిన తొలిసదస్సు
తెలుగుభాష చరిత్ర, సంస్కృతిని స్పృశించిన తొలిసదస్సు పరిశోధనాత్మకమైన అంశాలను వివరించింది. చరిత్ర, సంస్కృతి, పురావస్తుశాస్త్రపీఠం అధిపతి ఆర్‌.చంద్రశేఖరరెడ్డి ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు. ఆరవ అఖిలభారత తెలుగు మహాసభల్లో భాగంగా శనివారం జరిగిన ఈ సదస్సులో ఆచార్య జి.వెంకటరామయ్య ఉత్తరాంధ్ర దేవాలయాలు, ఒడిషా శిల్పప్రభావం అనే అంశంపై పత్ర సమర్పణ చేశారు. ఉత్తరాంధ్ర దేవాలయాలపై ఒడిషా రాజకీయ, ఆర్ధిక, మత,సంస్కృతిక అంశాలు, దేవాలయ, వాస్తు, శిల్పకళలపైన ప్రభావాన్ని చూపాయని, దీనికి దోహదపడిన రాజకీయ, భౌగోళిక సమతుల్యతను విశ్లేషిస్తూ, శ్రీముఖలింగం, శ్రీకూర్మం, నారాయణపురం, మహేంద్రగిరి దేవాలయాల వాస్తు, శిల్పరీతులను విశ్లేషణాత్మకంగా విశ్లేషిస్తూ, ఆంధ్రదేశాన్ని పరిపాలించిన చాళుక్యుల వాస్తు, శిల్ప కళారీతులకు భిన్నంగా ఉత్తరాంధ్రప్రాంతం తూర్పుగాంగులు, కళింగ గజపతులు వాస్తు, శిల్పకళలు ప్రగాఢమైన ప్రభావాన్ని చూపాయన్నారు. రిజిస్ట్రార్‌ ఆచార్యభట్టు రమేష్‌ తెలుగులో గిరిజన సంస్కృతి, సాహిత్యం అనే అంశంపై పత్రసమర్పణ చేశారు. వేదసాహిత్యంలో వర్ణాశ్రమ ధర్మాన్ని పేర్కొనబడినదేగాని, గిరిజన జాతులగురించి ప్రస్తావించలేదన్నారు. దీనికి మూలాలు ఆంధ్రదేశంలో ప్రత్యేకించి ఉత్తరాంధ్రప్రాంతంలో నివాసంఉండే 19 గిరిజన తెగలు ప్రధానంగా మాలిజీవనం, సరళి పరిశీలిస్తే తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో 32 గిరిజన తెగలుంటే అందులో 19 గిరిజన తెగలు ఆంధ్ర, ఒడిషా సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్నారన్నారు. భాషాసంస్కృతికి గల మూలాలు గిరిజన తెగనుంచి శిష్ఠజన సంస్కృతిలో ప్రవేశించినట్టు ఆయన పేర్కొన్నారు. అధ్యాపకులు ఇ.శోభన్‌బాబు మాట్లాడుతూ, దేవాలయాలు మనసంస్కృతికి వారధులు అనే పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. భారతీయ సంస్కృతీ జీవన విధానంలో దేవాలయాలు అనాదికాలంనుంచి జాతి, కుల, మత, ప్రాంతీయ భాషాభిమానులకు అతీతంగా సమైక్యతను, సమగ్రతను బోధించాయన్నారు. విద్య, వైద్య,ఆరోగ్యం, సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎంతో క్రియాశీలకమైన పాత్రపోషిస్తున్న దేవాలయాలు ఆటలకు, పాటలకు వీనుల విందుగొలిపే నృత్యం, నాట్యం, సంగీతం, సాహిత్యాదుల సమావేశ స్థలాలుగా ఒక తరం నుంచిమరోతరానికి సాంస్కృతిక వారధులుగా, ఆలయ సంస్కృతిని కాపాడుకోవాలని తెలిపారు. సదస్సు అధ్యక్షులు ఆచార్య ఆర్‌.చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, తెలుగుశాసనాలలో ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి మూలాలను శాసనాధారంగా విశ్లేషించారు. ఆంధ్ర, తెలుగు పదాలు పూర్వరూపాలు చారిత్రక భాషాపరమైన వ్యవహారంగా ఏవిధంగా ప్రాచుర్యంలోకి వచ్చిందో వివరించారు. తెలుగుశాసనాలు, కన్నడ, తమిళ ప్రాంతాలలో విస్తరించిన క్రమాన్ని శాసనపరంగా వివరించారు. ఒరియా ప్రాంతంలోను, ఉత్తరాంధ్రప్రాంతాలలలోని శాసనాలను వివరించారు. సదస్సుకు సమన్వయకర్తగా పి.అప్పారావు వ్యవహరించారు.

1 comment:

  1. పచ్చగా కళకళలాడుతున్న మీ బ్లాగులో తెలుగు మహాసభల గురించి చక్కటి వివరాలు తెలిసి సంతోషించాను.
    పక్కరాష్ట్రంలో ఈ సభలు జరగటం సంతోషమే కానీ మన రాష్ట్రంలో జరిపించటానికి రాజకీయాలే అడ్డుపడివుండవచ్చునని బాధ గా ఉంది.
    రేపటి సమాచారం గురించి ఎదురు చూస్తాము.

    ReplyDelete