తెలుగుభాషకు, తెలుగువారి సమైక్యతకు
జవజీవాలు పోసిన మహామహులలో సురవరం ప్రతాపరెడ్డి ఒకరు. వారి
సురవరం ప్రతాపరెడ్డి |
కుడిగా,
స్త్రీజనోద్దారకుడిగా, చరిత్ర పరిశోధకుడిగా, సంఘ సంస్కర్తగా ఆయన చేసిన
బహుముఖీన సేవా కార్యక్రమాలు నేటి తరానికి ఆదర్శాలే. ఆయన నిజామాంధ్రలో
ఆంధ్రమహాసభ ద్వారా చేసిన భాషా సేవ, గోలకొండ పత్రిక స్థాపన, సంపాదకత్వం
బాధ్యతల నిర్వహణ, తెలంగాణ ప్రాంత సాహిత్య చైతన్య దీపికగా ఆయన వెలువరించిన
గోలకొండ కవుల సంచిక, ఇరవై ఏళ్లపాటు పరిశోధించి, శ్రమించి తెలుగుజాతికి
అమూల్య కానుకగా, వారసత్వసంపదగా ఇచ్చిన ఆంధ్రుల సాంఘీక చరిత్ర ఉద్గ్రంథం,
ఆయన రాసిన రచనలు, చేసిన తెలుగు భాషాసేవ అపారం, గురజాడ, గిడుగు, కందుకూరి
వీరేశలింగం పంతులు వలె, రెడ్డిగారు ఆంధ్రమహాసభ ఉద్యమ నాయకునిగా, తెలుగు
సాహిత్యోద్యమ వైతాళికులుగా చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలలో లిఖించబడ్డారు.
అందుకే తెలుగుభాషోద్యమ సమాఖ్య వారు ఆయన జయంతి మే 28న తెలుగుజాతి వారసత్వ
దినోత్సవం ప్రకటించి, తెలుగు జాతి, సాహితీ, భాషా సంస్కృతుల ఔన్నత్యా నికి
తెరలేపింది. ఆ మహామహుని సేవలను, త్యాగమయ సాహితీ జీవితాన్ని తెలుసుకుంటే
కొంతైనా మన మాతృభాషపైన తెలుగుపట్ల అభిమానం పెరుగక తప్పదు.
బ్రిటిష్ వాడి భాషా వ్యామో హానికి, పాశ్చాత్య సంస్కృతికి లోనైన మనకు, మన
మాతృభాషైన తెలుగు ధనం విలువలు తెలియాల్సి వుంది. తెలుగునాట ఎక్కడచూసినా,
వ్యాపార వస్తువుగా పరిగణింపబడుతున్న ఆంగ్ల బడులే అధికంగా కనిపిస్తున్నాయి.
వాటికి లభిస్తున్న ఆదరణ అంతా, ఇంతా చెప్పనలవికాదు. నర్సరీ నుండి పీజీ
స్థాయి వరకు, వైద్య సాంకేతిక కోర్సులలో ఆంగ్లభాషే ఆదిపత్యం చల యిస్తుం డగా,
మమ్మి, డాడీలను పిలిపించుకోవాలన్న తహతహ పట్ల అన్ని వర్గాల ప్రజలు ప్రీతి
కనబరుస్తుండటం గమనించదగిన విషయం. తెలుగుభాషకు ప్రాచీన హోదాను
కట్టబెడుతున్నట్లు కేంద్ర ప్రభు త్వం ప్రకటించినా, తెలుగువాడిలో
రావాల్సినంత చైతన్యం కానరావడం లేదు, ఇందుకై చర్చిస్తే ఎన్నెన్నో కారణాలు
కనబడ తాయి. నిస్తేజంగా, నిర్లిప్తంగా వున్న తెలుగువాడిలో తెలుగుభాషా తేజం,
చైతన్యం ప్రజ్వలింపజేయాల్సి వుంది, కొలిమి రగల్చాల్సిన తరుణం ఆసన్నమైంది.
లేకుంటే ఐక్యరాజ్యసమితి నివేదికలోచెప్పినట్లుగా, 30 శాతం మంది
ఆభాషకు దూరమైతే, సమీప కాలంలో ఆభాష కనుమరుగైపోతుంది. ఇట్లాంటి సంక్లిష్ట
పరిస్థితులలో భాషా చైతన్యం, భాషోద్యమం రాజుకోవాలి.
జననం-విద్యాభ్యాసం
సురవరం
ప్రతాపరెడ్డి 1896, మే 28న మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల సంస్థానంలోని
అమలాపురం సమీపంలోని ఇటిక్యాల పాడులో జన్మించారు. వీరు కేవలం 58 సంవత్సరాలు
మాత్రమే జీవించారు. తాను బతికినంత కాలం తెలుగుభాషోద్ధారకునిగా, సాహిత్య
చైతన్యదీప్తిగా, పైపెచ్చు సాంఘీక సంస్కర్తగా పనిచేశారు.
1954
ఆగస్టు 25న మరణించారు. ప్రతాపరెడ్డి తండ్రి చిన్నతనం లోనే మరణించారు. ఆయన
చిన్నాన్న రామక్రిష్ణారెడ్డి ఎబియం మిషనరీ పాఠశాలలో ప్రాధమిక విద్యను
హైదరాబాద్ నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్, మద్రాస్ ప్రెసిడెన్సీ మరదలు
పద్మావతిని 1916లో వివాహం చేసుకున్నారు. సంతానం పదిమందికాగా, ఇద్దరు
కుమారులు విగతజీవులు. నలుగురు కుమారులు, నలుగురుపుత్రికల సంతానం.
సురవరం ప్రతాపరెడ్డి తన చదువు పూర్తికాగానే హైదరాబాద్ కొత్వాల్‌గా వున్న
రాజబహదుర్ వేంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలోని రెడ్డి హాస్టల్‌కు ఆయన కోరికపై
వచ్చారు. ఇక్కడ ఆయన పనిచేసిన దశాబ్ది కాలంలో రెడ్డి హాస్టల్ నిర్వహణను ఒక
విద్యాలయంగా తీర్చిదిద్దారు. నాటి నైవాసిక విద్యార్థులలో దేశభక్తి బీజాలను
నాటారు. 1924 ప్రాంతంలో ఈహాస్టల్ వదాన్యుల సహకారంతో స్థాపించబడింది. ఆ
విధంగా హైదరాబాద్‌లో రెడ్డి సాంఘీక సేవా జీవితం పునాదులు వేసింది. మద్రాస్
కళాశాలలో చదువుతున్న ప్పుడే నాటి జాతీయ ఉద్యమ ప్రభావం ఆయనపై పడింది. నిజాం
రాష్ట్రాంధ్ర దుస్థితి రూపురేఖలను మార్చాలన్న తపన ఆనాటి నుండే సురవరం
మనస్సులో నాటుకొని పోయింది. హాస్టల్ కార్యదర్శిగా వచ్చాక, వేయి
గ్రంథాలున్న హాస్టల్ లైబ్రరరీని 11వేల గ్రంథాల వరకు పెంచి, విద్యార్థులలో
భాషాభివృద్ధికి కృషి చేశారు.
జోగిపేట ప్రథమాంధ్రమహాసభ - 1930
1930, మార్చి, 3,4,5 తేదీలలో జోగిపేటలో మూడురోజులపాటు ప్రథమాంధ్ర మహాసభలు
జరిగాయి. ఆనాటి సభలకు హైకోర్టు న్యాయవాదిగా ఉన్న సురవరం అధ్యకత వహించారు.
60 మంది ప్రతినిధులతో ఈ సభలలో పాల్గొన్నారు. సంగారెడ్డిమీదుగా జోగిపేటకు
అందోల్ మీదుగా సత్కారాలు అందుకుని వచ్చారు. ఆనాటి సభలో రెడ్డి చేసిన
ప్రసంగం చైతన్య స్ఫోరకమైనది. తెలుగు మాతృభాష దుస్థితిపై వారు ఎంతగా
వ్యాకులపడిన విధం మనకు కనిపిస్తుంది. అక్కన్న మాదన్నల తర్వాత హైదరాబాద్
సంస్థానంలో భాషా పరంగా, రాజకీయంగా మనం బలహీనులమై పోయామని, ఈ దుస్థితి
రావడానికి లోపాలను కనుక్కోవాలని అన్నారు. మన మాతృభాషను కాపాడుకోవాలని,
ఉర్దూ రాజ్యమేలుతున్న హైకోర్టు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలోను తెలుగు ఇతర
భాషలకు చుక్కెదురు కావడాన్ని ఆయన నిరసించారు. నూటికి 90 శాతం కాని ప్రజలకు
ఉర్దూభాషను విద్యాలయాలలో బోధనా భాషగా రుద్దుతుండడాన్ని ఆయన తప్పుపట్టారు.
బలవన్మా ఘస్నానం వలన ఎవ్వరు ఏమి కట్టుకుందరో ఊహింపజాలమని ఆయన తన ఆదేవనను
వ్యక్తం చేశారు. ఆనాటి మహాసభలలో వారి రాజకీయ గురువులు మాడ పాటి హన్మంతరావు,
పులిజాల రంగారావు, ఉన్నవ వేంకట్రా మయ్య, వామననాయక్, అనంత వెంకటరావు,
కృష్ణస్వామి ముదిరాజ్, దూపాటి వెంకట రమణాచార్యులు, భాగ్యరెడ్డివర్మ, ఎం.
నారాయణరావు, ఆది రాజు వీరభద్రరావు, వేంకటేశం గుప్త, మహిళా ప్రతినిధి
నడింపల్లి సుందరమ్మ తదితరలులు పాల్గొని, వివిధ తీర్మాణాలను
ప్రతిపాదించినారు.
గోల్కొండ పత్రిక స్థాపన
సురవరం
హాస్టల్ కార్యదర్శిగా పనిచేస్తూనే, కొత్వాల్ సహకా రంతో గోల్కొండ పత్రికను
స్థాపనకు కదిలారు. తనకు ప్రజాహి తంగా ఒక పత్రికద్వారా సేవ చేయాలని ఉందన్న
అభిలాషను వ్యక్తం చేయడంతో కొత్వాల్ పత్రిక స్థాపనకు చేయి అందిచారు.
ఏడుగురు హైదరాబాద్ నగర పెద్దలను కొత్వాల్ పిలిపించి, తన వేయి రూపాయల
చందాతో రెడ్డిని మద్రాస్‌కు పంపించి, ప్రింటింగ్ మిసన్, అక్షరాల
టైపుపెట్టెలను తెప్పించారు. నిజాం రాజు అనుమతితో, పత్రిక నగరంలోని ట్రూప్
బజార్‌లో ద్వైవారపత్రికగా ఒక చిన్న భవనంలో స్థాపించారు. తదుపరి ఈ
పత్రిక 1947 నాటికి దినపత్రిక స్థాయికి ఎదిగింది. దాదాపు 23 సంవత్సరాల
పాటు సంపాదకునిగా బాధ్యతలను నిర్వర్తించి, సంపాదకీయాలే కాకుండా, అనేక
ప్రక్రియలలో రచనలు గావిం చారు. పత్రిక నాలుగు దశాబ్దాల పాటు పనిచేసి,
చివరకు నష్టాలకు గురై 1967లో మూతపడింది. ఆ కాలంలో నల్లగొండ, ఇనగుర్తిల
నుండి నీలగిరి, తెలుగుపత్రికలు ప్రచురించ బడు తుండెడివి. తదుపరి ఈ రెండు
పత్రికలు ఆగిపోయాయి. తెలుగు చదివిన సబ్ ఎడిటర్లు, ప్రూఫ్ చూసేవారు
దొరకకపోవడం వల్ల ప్రతాపరెడ్డి, సంపాదకుల నుండి మేనేజర్‌గా, సబ్ ఎడిటర్,
ఫ్రూఫ్ రీడర్‌గా, గుమాస్తాగా, ఛప్రాసీగా అన్నింటిని తన భుజస్కంధాలపై వేసు
కొని, సవ్యసాచివలె బాధ్యతలను కొంత కాలం నిర్వహించారు. ఈ పత్రిక ద్వారా
తెలుగుభాషా సాహిత్యోద్యమాన్ని పునర్జీవింప జేయడమే కాకుండా, కొడగట్టి పోయిన
సాంఘీక చైతన్యాన్ని రగిల్చారు. ఒక్క గోల్కొండ పత్రిక లోనే రెడ్డి రచనలు 15
వందల దాకా అచ్చయ్యాయి. ఆనాటి గోల్కొండ కార్యాలయం సాహితీ నిలయంగా మలచబడి,
వచ్చి పోయే విద్వాంసులతో సాహితీ చర్చలు జరిగేవి. 17 వాల్యూమ్ లుగా ఆయన
పేర్చబడ్డా యని, రెండేళ్లకిందట అచ్చయిన సుర వరం దస్తూరి కావ్యంలో
ఉటకించబడింది. ఆంధ్ర సారస్వత పరిషత్తులోని సురవరం వైజయంతి పీఠం సురవరం రచనల
విశ్లేషణకు కృషి చేస్తున్నది.
గోల్కొండ కవుల సంచిక : ఇతర రచనలు
గోల్కొండ
కవుల సంచిక ద్వారా నిజామాంధ్రలో సాహిత్యోద్యమ చైతన్య వ్యాప్తి జరిగింది.
1934లో సురవరం సంపాదకత్వంలో వెలువడిన ఈ సంచికలో 354 మంది ఆధునిక కవుల పద్య
కవిత్వాలు చోటు చేసుకోబడ్డాయి. ఇందులో పదిమంది కవియి త్రులు. వస్తువును
బట్టి 11 విభాగాల్లో ఈ కవిత్వాలు విభజింప బడ్డాయి. 183 మంది పూర్వకవుల
పరిచయాలు ఇవ్వబడ్డాయి. తెలంగాణా జాగృతి సంస్థవారు 2009లో గోలుకొండ కవుల
సంచి కను యధాతతంగా ముద్రించి తక్కువ ధరలో విక్రయిస్తున్నారు.
ఆంధ్రుల సాంఘీక చరిత్ర
1949లో
ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రకటించిన, వీరి ఆంధ్రుల సాంఘీక చరిత్రనన్నది
అద్భుత పరిశోధక గ్రంథం, నేటి కాలం వరకు ఎన్నెన్నో పునర్ముద్రణలకు
నోచుకున్నది. రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ వంటి ఉద్దండుల ప్రశంసలకు
నోచుకుంది. వారి మిత్రులు శంకరనారాయణ, దేవులపల్లి రామానుజరావు, పులి జాల
వారిప్రోద్భలంతో రాశారు. ఇందులో వారు తూర్పు చాళుక్య యుగం, కాకతీయుల యుగం
రెడ్డిరాజుల యుగం, రెండు అధ్యాయాలలో విజయనగర సామ్రాజ్యకాలంతోపాటు, క్రీ.శ.
1600 నుండి 1907 వరకు ఎనిమిది అధ్యాయాలలో విపులంగా చర్చించారు. రాజుల కాలం
లోని సామాన్య ప్రజల జీవన విధా నాలను ఆయన పరిశోధించి, చర్చించి, చరిత్ర
రచనకు కొత్త నిర్వచనం చెప్పారు. ఈ గ్రంథ పరిశోధనకుగాను, కేంద్ర సాహిత్య
అకాడమీ 1955లో తొలి అవార్డును ప్రకటించి గౌరవించి నారు. రెడ్డి 1953లో
విశాలాంధ్ర ఉద్యమ నేతగా కృషి చేశారు. వారి బహు ముఖీన సేవలు అనిర్వచనీయం.
వారు భౌతికంగా వెళ్లి యాభై ఎనిమిదేళ్లు దాటినా, వారి రచనలు తెలుగుజాతి
ఉమ్మడి సొత్తు. భౌగోళికంగా కలిసున్నా, విడిపోయినా వారి పేరిట తెలుగునాట
జాతి వారసత్వ దినోత్సవంగా ప్రక టించడం ముదావ హమని ప్రముఖ రచయిత అంప శయ్య
నవీన్ అన్న మాటలు అక్షరసత్యాలే.
ఆంధ్రప్రభ దినపత్రిక సౌజన్యంతో.
No comments:
Post a Comment