Tuesday, February 15, 2011

"తెలుగు నుడి: అపోహలు,వాస్తవాలు, పరిష్కారాలు" చర్చా గోష్ఠి.

మన తల్లి భాష తెలుగు చరిత్రకు, వర్తమాన  స్థితికీ, ఉపయోగానికీ, సంబంధించి ఎన్నో సందేహాలు, అపోహలు మన సమాజంలో ఉన్నాయి. తెలుగును  అభివృద్ధి పరుచుకునే దిశగా మనకృషికి ఇవన్నీ అడ్డుపడుతున్నాయి. వీటిని తొలగించుకోవలసిఉంది. పరిష్కరించుకోవలసి ఉంది. వీటిని చర్చకు పెట్టుకుని, పరిష్కారాలను సాధించి ముందుకు సాగడానికి మనం సిద్ధం కావాలి. ఇందుకోసం హైదరాబాదులోని దోమలగూడలోని ఇందిరాపార్కు క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న హైదరాబాదు స్టడీ సర్కిల్ లో ఈ నెల 20 వ తేదీన చర్చా గోష్టి జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషా సమూహాలు తమతమ భాషలను రక్షించుకోవడానికి తిరిగి అంకితమయ్యే సందర్భమే ఫిబ్రవరి 21, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఈ రోజుకు ఒక రోజు ముందు జరుగుతున్న ఈ చర్చా గోష్ఠిలోఆసక్తి గలవారందరూ పాల్గొనవచ్చు. ' ఆర్టండ్ లెటర్స్ ' , ' నడుస్తున్నచరిత్ర మాసపత్రిక ',  తెలుగు భాషోద్యమకారులూ ఈ చర్చాగోష్ఠిని ఏర్పాటు చేస్తున్నారు.    చర్చా గోష్ఠి ఉదయం  10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది.               
తెలుగు భాషోద్యమకారుల నిరసన కార్యక్రమం
తెలుగు భాష పరిరక్షణ ,అభివృద్ధి తదితర అంశాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ ఫిబ్రవరి 21 ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇందిరాపార్కు వద్ద గల ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తెలుగు భాషాభిమానులందరూ పాల్గొనాల్సిందిగా తెలుగు భాషొద్యమ సమాఖ్య పిలుపునిస్తోంది.
తెలుగు వ్యతిరేక ప్రభుత్వ విధానాల్ని నిరసించండి.     
ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పిలుపు!     
  

No comments:

Post a Comment