మిల్పిటాస్: ప్రముఖ ప్రవాసాంధ్ర తెలుగు సంఘం తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) 2011 ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. తానా ఎన్నికల విభాగ ఛైర్మన్ ఉమాపతి రెడ్డి కట్టమంచి ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అర్హులైన అభ్యర్థుల వివరాలు మార్చి 8న వెల్లడిస్తామని నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి 12న ముగుస్తుందని ఉమాపతి తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తానా ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల నిర్వహణ నియమావళి తదితర వివరాలు www.tana.org లో చూడవచ్చని అధ్యక్షుడు జయరాం కోమటి తెలిపారు.
No comments:
Post a Comment