తెలుగుసమాజం, తెలుగు భాషోద్యమ సమాఖ్యల ఆధ్వర్యంలో ఆదివారం కడప జిల్లా
మైదుకూరులో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈకార్యక్రమం జరిగింది. తెలుగు సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు ,రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ధర్మిశెట్టిరమణ, తబ్బిబ్బు మహానందప్ప, ఉపాధ్యాయులు ఎ .బాలగంగాధర రావు , ఎల్. సూర్యనారాయణ రెడ్డి , విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగుతల్లి చిత్రపటాన్ని మల్లెపూదండ తో అలంకరించారు. ఈ సందర్భంగా మాతృభాష విశిష్టతను వక్తలు వివరించారు. విద్యార్థులకు పొడుపుకథలు , సామెతలు, తెలుగు పౌరుషం పుస్తకాలను బహుమతులుగా పంపిణీ చేసారు.