తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మైదుకూరులోని ఇందిరమ్మ కాలనీలోని ప్రభుత్వబడిలో విధ్యార్థులకు పద్యగానం , కథారచన పోటీలు నిర్వహించాము. తెలుగు సమాజం, తెలుగు భాషోద్యమ సమాఖ్య ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు భాషలో ప్రావీణ్యత, తెలుగు చరిత్ర,మాతృభాషలో విశిష్టత తదితర అంశాలపై పిల్లలకు రేఖామాత్రంగా వివరించడం జరిగింది. విజేతలైన విద్యార్థులకు రాయల పెద్ద బాల శిక్ష , నంద్యాల రామక్రిష్ణమరాజుగారి ఆణిముత్యాలు పుస్తకాలతోపాటు, బాలభారతం బాలల పత్రికలు బహుమతులుగా అందచేశాము.అలాగే తెలుగు పౌరుషం, గండికోట , మరికొన్ని పుస్తకాలను బడి గ్రంథాలయానికి కూడా అందచేయడం జరిగింది.
Wednesday, August 29, 2018
Wednesday, July 11, 2018
Wednesday, February 21, 2018
Subscribe to:
Posts (Atom)