Tuesday, December 22, 2009

ఇతర రాష్ట్రాల్లో తెలుగుభాష పై వివక్ష! !

తర రాష్ట్రాల్లో తెలుగుభాష పై వివక్ష దారుణంగా సాగుతోందనడానికి తాజాగా తమిళనాడు లోని కృష్ణగిరి సంఘటన తార్కాణంగా నిలుస్తుంది. తమిళనాడు లో తెలుగు మాతృభాష గా గల జనాభా 42 శాతం ఉన్నట్లు అక్కడి తెలుగు భాషోద్యమ సంఘాల అంచనా! తమిళనాడు లోని కృష్ణగిరి , ధర్మపురి జిల్లాలలో దాదాపు 60 శాతం మంది తెలుగు మాతృభాషగా గలవారు కావడం విశేషం! తిరువళ్ళూర్, వేలూర్, కోయంబత్తూరు జిల్లాలలో కూడా అధిక సంఖ్యలో తెలుగువారున్నారు. ఈనేపథ్యంలో తెలుగు భాషను అక్కడ రెండవ అధికార భాషగా ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలనే తెలుగు వారి డిమాండ్ ముమ్మాటికీ సముచితమైనది.. ఏ రాష్ట్రంలో నైనా అధిక సంఖ్యాకులు మాట్లాడే భాషను మొదటి అధికార భాషగా గుర్తిస్తారు. ఆ తర్వాత 12 శాతానికి మించి ఇతర భాషను మాట్లాడే వారు ఉంటే ఆ భాషను రెండవ అధికార భాషగా గుర్తిస్తారు!
ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్ల మంది తెలుగు భాషను మాట్లాడే వాళ్ళున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 8.5 కోట్ల మంది, తమిళనాడు లో 2.8కోట్ల మంది(42%), కర్నాటకలో 1.8 కోట్ల మంది(33%), మహారాష్త్రలో 1.5 కోట్ల మంది(16%), ఒరిస్సాలో 90 లక్షల మంది(23%), కేరళ, పాండిచ్చేరి, చత్తీస్ ఘడ్ లలో మరో 60 లక్షల మంది, దేశ వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో లక్ష మంది తెలుగు వారుండగా, మిగిలినవారు విదేశాల్లో జీవిస్తున్నారు. అంటే తమిళనాడు, కర్నాటక, ఒరిస్సా, మహారాష్త్ర లలో తెలుగు భాషకు రెండవ అధికార భాషగా గుర్తింపు పొందేందుకు అర్హత ఉంది.
ఇతర మైనారిటీ భాషల పట్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ఉదారతను చూపింది. కేవలం 12 శాతానికి పైగా భాషా వ్యవహర్తలుంటే చాలంటూ దేశంలోనే మొట్టమొదటి సారిగా ఉర్దూ భాషను రెండవ అధికార భాష గా గుర్తించడమే ఇందుకు నిదర్శనం. ఆంధ్ర ప్రదెశ్ లో ఉర్దూ భాషను 13 జిల్లాలలో రెండవ అధికార భాషగా గుర్తించడం జరిగింది. హైదరాబాద్, కడప, రంగా రెడ్డి, మెదక్, నిజామాబాద్, కర్నూలు, అనతపురం, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, వరంగల్, మెహబూబ్ నగర్, మరియు ఆదిలాబాదు జిల్లాలలో ఉర్దూ భాషను రెండవ అధికార భాషగా గుర్తించారు. ఆయా జిల్లాలలోని మొత్తం జనాభాలో 12 శాతానికి పైగా ఉర్దూ భాషను మాట్లాడే వారు ఉండటమే ఇందుకు కారణం!

5 comments:

  1. తెలుగు రాష్ట్రంలోనే తెలుగుకి తెగులు పడుతుంటే ఇతారాష్ట్రాల గురించి ఇంకా ఏం మాట్లాడుతాం?

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. మన రాష్ట్ర రాజధానిలో "ఎక్కడి తెలుగు తల్లి, ఎవ్వని తెలుగు తల్లి" అంటే పట్టించుకునే దిక్కే లేదు(అధిష్టానం ఆదేశాల కోసం ఎదురు చూడడం తప్ప). ఇక మిగతా రాష్ట్రాలలో వున్న తెలుగు ప్రజల పాట్లు వినే వారెవ్వరు?

    ReplyDelete
  4. తెలుగు వారు ఏ ఏ దేశాల్లో ఎంత మంది ఉన్నారో కూడా వివరించి ఉంటే ఇంకా బాగుండేది. ఏమంటారు?

    ReplyDelete
  5. we are neglecting our language,jayalalitha rightly says that if you implement telugu in your state.i am ready to recognise telugu as a second language

    ReplyDelete