తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంతీయ కార్యదర్శి గా తవ్వా ఓబుల్ రెడ్డి నియమితులయ్యారు.27న గుంటూరులో నిర్వహించిన తెలుగు భాషోద్యమ సమాఖ్య కేంద్ర కార్యవర్గ సమావేశంలో సమాఖ్య అధ్యక్షఁలు డా. సామల రమేష్‌బాబు ఆయనను నియమించారు. ఈ సందర్భంగా తవ్వా ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో తెలుగుభాషాభిమానుల సహకారంతో తెలుగుభాషా పరిరక్షణకూ, వికాసాఁకి కృషి చేస్తానని తెలిపారు. రాయలసీమలోని జిల్లా, మండల స్థాయిల్లో తెలుగు బాషోద్యమ సమాఖ్య శాఖలను విస్తరించేందుకు భాషాభిమానులు, రచయితలు, కవులు ముందు కు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయమై సమాచారం కోసం 9440024471 నెంబర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు. మైదుకూరులోని సెయింట్‌జోసెఫ్ ఆంగ్లమాధ్యమ పాఠశాలలో తెలుగుభాషకు అవమానం జరిగిన సంఘటనపై ప్రజలు, భాషాభిమానులు, పెద్ద ఎత్తున ఉద్యమించారన్నారు. దీనికి సంబంధించి చట్టపరమైన చర్యలు ఇంతవరకు తీసుకోలేదని అన్నారు.
ఓబుల్ రెడ్డి నియామకంపై పలువురి హర్షం
తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంతీయ కార్యదర్శిగా తవ్వా ఓబుల్ రెడ్డిని నియమించడం పట్ల తెలుగు సామాజిక సాంస్కృతిక సాహిత్యాభివృద్ధి సంస్థ ప్రతినిధులు ఎస్ సాదక్, ఎ.వీరాస్వామి, ముండ్లపాటి వెంకట సుబ్బయ్య, ధర్మిశెట్టి వెంకట రమణయ్య, పి.కృష్ణయాదవ్, పి.బాబయ్య భారతీయ సాహిత్య పరిషత్ వ్యవస్థాపకులు, ప్రముఖ సాహితీకారులు టక్కోలు మాచిరెడ్డి, ప్రముఖ కథా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, రచయితలు నూకా రాంప్రసాద్ రెడ్డి, వేంపల్లి రెడ్డి నాగరాజు, టి తిప్పారెడ్డి, ఆన్ లైన్ మీడియా సంపాదకులు ఎం. విజయ భాస్కర రెడ్డి, తవ్వా విజయ భాస్కర రెడ్డి, జె. కోటేశ్వర రెడ్డి, అఖిల భారత యువజన సమాఖ్య కడప జిల్లా నాయకులు పి. భాస్కర్, అబ్దుల్లా, తెలుగు పండితులు మూలే సాంబశివా రెడ్డి, ప్రముఖ న్యాయవాది బి.ఎన్. శ్రీనివాసులు, యోగా శిక్షకుడు, సంఘసేవకులు నారాయణ రెడ్డి, తెలుగు భాషాభిమానులు విజయ్ , శీర్ల నాగమోహన్, పి. బసయ్య , పిచ్చపాటి వీరా రెడ్డి, కానుగ దానం తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
పక్క చిత్రం: ఈనాడు దినపత్రిక , డిసెంబరు 29, 2009 వార్తాంశం..