సాహితీ సమరాంగణ చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల రూపును వెల్లడించే చిత్రపటం ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. పోర్చుగీసు యాత్రీకుడు,చిత్రకారుడు డామింగో పేస్ 1520 సంవత్సరంలో ఈ చిత్రాన్ని గీశారు. రాయలను చిత్రించడానికి పేస్ కు 15 వారాల సమయం పట్టిందట! పూనే నగరం లోని భారతీయ ఇతిహాస్ సంశోదన్ మండల్ లో ఉన్న ఈ చిత్రాన్ని హైదరాబాదుకు చెందిన ప్రముఖ చారిత్రక పరిశోధకుడు డాక్టర్ క్రిష్ణారావు కేశవ్ ఫోటో తీసి వెలుగులోకి తెచ్చారు. శ్రీ కృష్ణదేవరాయల 500 వ పట్టాభిషేక వారోత్సవాలు జరుగుతున్న ఈ సందర్భంలో రాయల అసలు చిత్రం వెలుగు చూడటం సంతోషించదగ్గ విషయం! విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన 26 మంది రాజుల్లో 1509 నుండి 1529 వరకు ఓటమి ఎరుగని చక్రవర్తిగా పాలన సాగించిన రాయలు తన 49 వ ఏట కడుపుశూల వ్యాధికి గురై మరణించారని చరిత్ర చెబుతోంది.
చాలా మంచి వార్త అండీ. ఒక మంచి పరిపాలనా దక్షుడి చిత్రపటం లభించటం ముదావహం.ఈ వార్త అసలు ప్రచురించ దగినది కాదు అనిపిస్తుందేమో మన పేపర్ల వాళ్ళకి.నేను ఎక్కడా చదవలెదు.టీవీ ల వాళ్ళకి అసలు పట్టదనుకోండి ఈ విషయం.
ReplyDeleteGreat news..
ReplyDeleteమంచివార్త ఇప్పటికైనా మనకి ఆయన దర్శనభాగ్యం కలిగింది. కానీ ఈయన మన NTR అంత అందంగా లేరు :( :)
ReplyDeleteఅందగాళ్లంతా దమ్మున్నోళ్లు కారు.. రాయలెక్కడ, ఎన్‌టీఆర్ ఎక్కడ.. ఇదేం పోలికండీ బాబూ.. పోలిక అనే పదానికే అర్థం లేకుండా చేశారు.
Deleteరిషి గారూ! ఈ వార్తను ఆంగ్ల పత్రిక ది హిందూ ఈనెల 11 న ప్రచురించింది. తెలుగు లో సాక్షి దిన పత్రిక ఏప్రిల్ 22 న ప్రచురించింది. మరికొందరికి తెలియాలనే ఉద్దేశంతో నా బ్లాగు లో పోస్ట్ చేశాను.
ReplyDeleteఓబుల్ రెడ్డి గారు,
ReplyDeleteధన్యవాదాలండీ,మిస్స్ అయ్యననన్నమాట నేను ఈ వార్త ని సాక్షిలో.
సౌమ్య గారు,
శ్రీక్రిష్ణదేవరాయలు అంటే నాకు డీడీ లో వచ్చిన సీరియల్ పాత్రధారి అశోక్ రావు గుర్తువస్తాడండీ.ఎన్ టీఆర్ గారిని నేను చూడలేదు ఆ పాత్రలో.మీ కామెంట్ చూసి వెంటనే యూ ట్యూబ్ లో చూసేసా.ఆహా ఏమి రాజసం ఆయనది.
హంపి ట్రిప్ లో ఆనె గొందిలో రాయల వారి సమాధి చూసినపుడు ఆయన చిత్ర పటం ఒకటంటూ మనకు లేకపోయెనే, ఎప్పటికైనా చూడగలమా అని ఎంతగానో అనిపించింది.
ReplyDeleteకానీ, తెనాలి రామకృష్ణ సినిమా చూశాక రాయల వారు ఇంతందంగా ఉంటారా అనిపించేంతగా శ్రీకృష్ణుడి మల్లేనే రాయలవారి రూపంలో కూడా ఎన్ టీ వోడే స్థిరపడిపోయాడు. ఆ చిరునవ్వు, గొంతులో గాంభీర్యం,భువన విజయానికే వన్నె తెచ్చిన Royal రాయలు!
ఫొటోని జాగ్రత్తపరచుకున్నాను. థాంక్సండీ!
ఆయ్యో రిషిగారు అదెలా మిస్ అయ్యారండి ఈన్నాళ్ళు?
ReplyDeleteమహామంత్రి తిమ్మరుసు, తెనాలి రామకృష్ణ సినిమాలలో రాయలు పాత్రకే జీవం పోస్తారు NTR.
హవభావ ప్రకటనలలో రాజసం ఉట్టిపడుతుంది. మన రాయలుని ఇలా తప్ప ఇంకో రకంగా ఊహించుకోలేని పరిస్థితి తీసుకుని వచ్చారు మన ప్రజలకి.
నిజంగా ఇవాళ ఈ ఫొటో పెట్టినందుకు ఓబుల్ రెడ్డిగారికి చాలా చాలా కృతఙ్ఞతలు
NTR antha andagmu ga leka poyana antha kantae hindva samsakruthini parirakshchnina mahanaubavudu ayana. ledhu antae mee peru yea shiaba ayyi undaedemo ee sariki
ReplyDeletemotaniki photo chusesamu, thanks for sharing.
ReplyDeleteవాస్తవానికి శ్రీకృష్ణదేవరాయులు...చుట్టానికి మన N.T.R లాగ స్పరధరూపి, అందగాడు కారు...! కృష్ణదేవరాయులు ఎత్తు 5 అడుగులు..స్పటికముఖం. నేనీ విషయాన్ని..అప్పుడెప్పుడొ..దూరదర్శన్ లో నెహ్రు రచించిన " డిస్కవరీ ఆఫ్ ఇండియా " పుస్తక ఆదారంగా గిరీష్ కర్నాడ్ నిర్మించిన సీరియల్లో కృష్ణదేవరాయల పాత్రని..ఓంపురి వేసారు..చూసి నేనుచ్ హాలా ఆశ్చర్యపోయా..తర్వాత చరిత్ర పుటల్లోకి..ఆర్కియాలజి పుస్తకాలోకి తొంగి చూస్తే..తెలిసింది పైన నేనుచ్ హెప్పిన విషయం, నాకు తెలిసి తిరుమలలో కరెక్ట్ గా ఆయన ఎత్తు స్పటికముఖంతో ఉన్న విగ్రహం చూసాను..ఇప్పుడు అదెక్కడున్నదో కనపడుటలేదు..
ReplyDeletepuratana chitralaku bhadrata avasaram.
ReplyDeleteI saw bust photo of Rayalu'spicture during my school days .Portugese visitor described ''he looks every inch as a king.'Krishnadevarayalu was good looking ,of medium height .,and dignified.He suffered from smallpox in childhood and had some poxmarks on his body.This is the true picture.Not as handsome as NTR but goodlooking with royal presence .Irequest Reddygaru to inform where we can see the above picture ,in a museum or house?===ramaneeyam
ReplyDeleteరమణ రావు గారూ..! పూనే నగరం లోని భారతీయ ఇతిహాస్ సంశోదన్ మండల్ లో ఉన్న ఈ చిత్రాన్ని హైదరాబాదుకు చెందిన ప్రముఖ చారిత్రక పరిశోధకుడు డాక్టర్ క్రిష్ణారావు కేశవ్ ఫోటో తీసి వెలుగులోకి తెచ్చారని పై వార్తలోనే రాశాను. గమనించగలరు.
ReplyDeleteఒక మంచి చారత్రక విషయాన్నీ వెలుగు లోకి తెచ్చారు .మీకు అభినందనలు
ReplyDelete