Friday, March 9, 2012

తెలుగులో మాట్లాడే పసిపిల్లలపై శిక్షలు ఇంకెంతకాలం?(ఈనాడు, సాక్షి 09-03-2012)

4 comments:

  1. Unfortunately the subject is moving away from the core of cruelty to children.

    "తెలుగులో మాట్లాడే పసిపిల్లలపై శిక్షలు ఇంకెంతకాలం?" బదులు "పసిపిల్లలపై శిక్షలు ఇంకెంతకాలం?" అని ఆలోచించే నాథుడే లేదా? భాష పేరుతొ రెచ్చగొట్టే బదులు, అభం శుభం తెలియని పిల్లలపై జరుగుతున్న జులుం వ్యతిరేకిద్దాం.

    ReplyDelete
  2. ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తికి ఇంగ్లిష్ మీద అంత వ్యామోహం ఉంటే తన పేరునే స్టీఫెన్ నికోల్సన్‌గా మార్చుకోవచ్చు. అంతా ఇంగ్లిషే కావాలనుకుంటే సంస్కృత పేరు మాత్రం ఎందుకు? అయినా ఇక్కడ పిల్లని కొట్టినందుకు కాకుండా ఇంకేదో కారణం చెప్పి ఏడవడం బాగాలేదు.

    ReplyDelete
  3. మీ అభిప్రాయాలతో ఎకీభవిస్తున్నాను.

    ReplyDelete
  4. తెలుగు బ్లాగర్లందరికీ నాదొక మనవి. ఇక్కడ నిజమయిన సమస్య తెలుగు వ్యతిరేకతో, ఇంగ్లీషు మీద మోజో కాదు.

    ప్రిన్సిపాలు గారికి ఇంగ్లీషు వ్యామోహం ఉండవచ్చు. అయితే ఈ సంఘటన మూల కారణం అధ్యాపకులు పిల్లలని ఎలా శిక్షించినా తప్పు లేదనే ఆయన అహంకారం మాత్రమె.

    అనేక చిన్నా చితకా కారణాల వల్ల పిల్లలు శారీరిక శిక్షకు లేదా అవహేళనకు గురి అవుతున్నారు. ఇది పిల్లల ఎదుగుదలకు అవరోధమే కాక చట్ట విరుద్ధం కూడా.

    తెలుగులో మాట్లాడినా, హోం వర్క్ చేయకపోయినా, యూనిఫారం వేసుకోకపోయినా, ఆలస్యంగా వచ్చినా బెత్తానికి పని ఇవ్వడం, అందరి ముందర అవహేళన చేయడం లాంటి శిక్షలు పాడి కాదు.

    వోటు హక్కు లేని పిల్లలు పెద్దల చేతిలో జులుంకి లోనయితే వారు పడే క్షోభ ఎవరు అర్ధం చేసుకుంటారు? ఇలాంటి సంఘటనలను తెలుగు భాషకు అవమానం అంటూ ప్రచారం చేస్తున్న పెద్దలు corporal punishment కి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడరు? ప్రతి విషయానికి భాష రంగు పులమడం ఎంతవరకు సబబు?

    ReplyDelete