హైదరాబాదులోని " తెలుగు లలిత కళాతోరణం" పేరుకు ముందు రాజీవ్ గాంధీ పేరును జత చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే ఉపసం హరించుకోవాలని తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ విభాగం తీర్మానించించింది. సమాఖ్య కేంద్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ సామల రమేష్ బాబు గారి సూచనలమేరకు ఈ తీర్మాణం చేసి ముఖ్యమంత్రి కి ఒక లేఖను పంపడం జరిగింది. తెలుగు జాతి, తెలుగు సంస్కృతి అనే భావనల ముందు మరే పేరైనా దిగదుడుపేనని తెలుగు లలిత కళాతోరణం పేరును మార్చడం అంటే తెలుగు జాతిని అవమాన పర్చడమేనని తెలుగు భాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ అభిప్రాయపడింది. ముఖ్యమంత్రికి లేఖను పంపిన వారిలో తెలుగు భాషొద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంత కార్యదర్శి, కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి, సమాఖ్య మైదుకూరు శాఖ ప్రతినిధులు ఎ.వీరాస్వామి, మహానందప్ప, వెంకట సుబ్బయ్య, ధర్మిశెట్టి రమణ తదితరులు ఉన్నారు. తెలుగు భాష పరిరక్షణ పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని వారు తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటనను కూడా వారు విడుదల చేశారు. కొందరు వ్యక్తుల ప్రయోజనాలకోసం తెలుగుజాతి స్ఫూర్తికి విఘాతం కలగడం శోచనీయమని వారు పేర్కొన్నారు.
అన్నా అలానే మీ చేత్తోనే..మరో ఉత్తరం కాని లేక ఉద్యమం కాని చేయాలని నా విన్నపం...అదీ " కడప " పేరుని మారుస్తూ ప్రభుత్వం వారు జి.వో ఇచ్చారు దయచేసి జిల్లాలకున్న ఒక చారిత్రకమైన పేరుని అలా వ్యక్తుల పేరు పెట్టడం ఎంతవరకు శొచనీయం..దయచేసి ఆ విషయంలో కూడా మీ తెలుగు భాషోద్యమమం వారు పోరాటమ్ చేయగలరని మనవి
ReplyDelete