తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకోసం " ఆంధ్రభూమి" దినపత్రిక ద్విగుణీకృతమైన రీతిలో నడుం బిగించింది. ఆంధ్రభూమి పత్రిక సంపాదకులు ఎం.వి.ఆర్.శాస్త్రి గారి చొరవతో ఆంధ్రభూమి " భూమిక " అనుబంధంలో " నుడి" అనే శీర్షికను ప్రారంభించారు. ప్రతి శనివారం "నుడి" శీర్షిక ప్రచురితమవుతుంది. తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ సామల రమేష్ బాబు గారు ఈ శీర్షికను నిర్వహిస్తున్నారు. తెలుగు భాషాభిమానులంతా ఈ శీర్షికలో పాలుపంచుకోవచ్చు! దిన పత్రికలు భాషా సాహిత్యాల ఊసును క్రమక్రమంగా విస్మరిస్తున్న పరిస్థితుల్లో తెలుగు భాషకోసం ప్రతివారం ఒక పేజీని కేటాయించిన ఆంధ్రభూమికి జేజేలు!
మిక్కిలి సంతోషదాయకం.
ReplyDeleteమీకు, మీ కుటుంబానికి, బంధు మిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు
ReplyDeleteశి. రా. రావు
సంక్రాంతి లక్ష్మి _శిరాకదంబం