అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కడప జిల్లా మైదుకూరులో తెలుగు భాషాభిమానుల సమావేశం, ఘనంగా జరిగింది. తెలుగు భాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ ఆద్వర్యంలో జరిగిగిన ఈ కార్యక్రమంలో వకృత్వపోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందచేశారు. సమాఖ్య మైదుకూరు శాఖ అధ్యక్షులు ఏ.వీరాస్వామి, గౌరవ సలహాదారులు టి.మహానందప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిధులుగా తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంత కార్యదర్శి తవ్వా ఓబుల్ రెడ్డి , తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి , రాయలసీమ పౌరహక్కుల సంఘం కన్వీనర్ ఎం.జె.సుబ్బరామిరెడ్డి, ఆర్.ఎస్.ఎస్. ప్రతినిధి రామమోహన్ హాజరయ్యారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ అధ్యక్షులు అరబోలు వీరాస్వామి , గౌరవ సలహాదారులు టి. మహానందప్ప, గ్రంథాలయ పాలకుడు శిద్ధవటం రామకృష్ణ లతో పాటు అనేకమంది తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు. వకృత్వపోటీలో విజేతలుగా నిలిచిన పి.మురళి,డి.లక్ష్మినారాయణ, దస్తగిరి లకు బహుమతులను అందచేశారు.
అభినందనలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెరగాలి.
ReplyDelete