ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఆయన పేరుతో సాహితీ పురస్కారాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. కవులు, కవయిత్రులు తమ కవితలను పంపాలని ఆహ్వానించారు. జులై 14న తన పుట్టినరోజున ఉత్తమ కవిగా ఎంపికయ్యే రచయితకు 'తనికెళ్ల భరణి సాహితీ పురస్కారం' అందిస్తామని గురువారమిక్కడ భరణి పేర్కొన్నారు. పురస్కారానికి ఎంపికైన రచయితకు నూతన వస్త్రాలు, రూ.50వేల విలువైన బంగారు పూలతో కనకాభిషేకం లేదా నగదును చెల్లిస్తామని తెలిపారు. కళ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సంజయ్‌కిషోర్ వివరాల ప్రకారం.. వచన కవితా సంపుటులై ఉండాలి. 50 పేజీలకు తక్కువ కాకుండా ఉండాలి. కవితా సంపుటి మూడు ప్రతులు పంపాలి. అవి 2009 జనవరి నుంచి 2011 ఏప్రిల్ మధ్య కాలంలో ప్రచురించినవై ఉండాలి. ఔత్సాహికులు మే 30 లోగా కళ ఫౌండేషన్‌కు పంపాలి. పంపాల్సిన చిరునామా: 6-1-69/5ఎ, సైఫాబాద్, హైదరాబాద్-4. వివరాలకు 94904 84606 ఫోన్ నంబరులో సంప్రందించాలి.
No comments:
Post a Comment