నెల్లూరు జిల్లా కావలిలో తెలుగు భాషోద్యమ సమాఖ్య నూతన శాఖ ఏర్పాటైంది. కావలిలో ఈ నెల 17 న శాఖకు నూతన కార్వర్గం ఎన్నిక జరిగింది. సమాఖ్య కేంద్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్ సామల రమేష్ బాబు ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా అదే రోజు సాయంత్రం ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.
ఇదేం భాషాభిమానం ?
ReplyDeleteపాత్రికేయ మిత్రులారా,
మమ్మీ వద్దు అమ్మే ముద్దు లాంటి శీర్షికలు పెట్టడం ద్వారా మీరు చెప్పదలుచుకుంటున్నదేమిటి ?
మమ్మీ అంటే అమ్మ కాదా ?
అమ్మకీ మమ్మీకీ తేడా ఏమిటి ?
మీ భాషాభిమానాన్ని మాతృత్వానికి ఎందుకు అంటగడుతున్నారు ?
తెలుగుని అభిమానించడం తప్పు కాదు. ఆ అభిమానాన్ని ప్రకటించుకోవడం కోసం ఆంగ్ల భాషని కించబరచడం తప్పని మీకు అనిపించదా ?
ఆంగ్లం ప్రపంచం అంతా విస్తరించిందంటే కారణం ఏమిటి ? అది తమ భాషని విశ్వవ్యాప్తం చెయ్యాలనే అంగ్లేయుల మాతృభాషాభిమానం కాదా ? వారి భాషవల్ల మీ భాషకి ఎటువంటి అన్యాయమూ జరగలేదు. నిజానికి మీ భాషా వికాసానికి ఆంగ్లేయులు చేసిన సేవ అపారం. వారే లేకపోతే మీ తెలుగువారికి కనీసం వేమన పద్యాలు కూడా మిగిలేవి కావని గుర్తించరెందుకు ?
మీరీ చిన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆంగ్ల ద్వేషాన్నే ఆంధ్ర భాషాభిమానంగా చెలామణీ చెయ్యాలని చూస్తున్నారెందుకు ?
పత్రికలో వచ్చినవాటికి సాధికారత దానికదే లభిస్తుంది. కాబట్టీ శీర్షికలు పెట్టే ముందు ఆ శీర్షిక పాఠకులకి ఎలాంటి సంకేతాలనిస్తుందనేదాని గురించి ఆలోచించడం మీ బాధ్యత.
ఆంధ్రాన్ని అభిమానించండి. కానీ ఆంగ్లాన్ని ద్వేషిస్తున్నారనే భావన చదువరుల మనసులోకి రానివ్వకండి.
అదే జరిగితే మీరు కోరుకుంటున్నదానికి వ్యతిరేక ఫలితాలు వస్తాయని గుర్తించండి.
ప్రణవి
/మమ్మీ అంటే అమ్మ కాదా ?
ReplyDelete'కాదండి'కానే కాదండి. కాని మంచి ప్రశ్న వేశారండీ.
/అమ్మకీ మమ్మీకీ తేడా ఏమిటి ?/
కాని ఔను కూడా అండీ. పిశాచపు పిల్లలకి మమ్మీలు అమ్మలయ్యే అవకాశం వుందండి, ఎందుకంటే మమ్మీలంటే కుళ్ళకుండా పాతరవేయబడిన సచ్చినోళ్ళ శవాలండి. కావాలంటే పబ్లిక్ గార్డన్స్ దగ్గర స్టేట్ మ్యూజియంలో ఓ 'మమ్మీ' ఇంకా బ్రతికేవుంటే, వెళ్ళి చూసిరండి.
"తెలుగు జాతికి ఉన్న ఏకైక జబ్బు పట్టించుకోకపోవడమేనని, దానిని పారదోలేందుకు అందరు ప్రయత్నం చెయ్యాలన్నారు." - రమేష్ బాబు గారు చక్కగా చెప్పారు. ఇంకో జబ్బు కూడా ఉంది.. పరాయి భాషపై ఉన్న మోజు, అభిమానం మన భాషమీద ఉండదు కొందరికి. మన భాషపై ఉన్న అభిమానాన్ని మనం చాటుకుంటూంటే అదేదో అవతలి భాషను తిడుతున్నారని తెగ బాధపడిపోడం చూస్తూంటాం. ఈ జబ్బును కూడా మనలోంచి పారదోలాలి.
ReplyDeleteశంకర్ గారూ,
ReplyDeleteమమ్మీ అంటే అమ్మ అవునో కాదో తేల్చుకునే ముందు మీరు పబ్లిక్ గార్డెన్స్, స్టేట్ మ్యూజియం లని తెలుగులో ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి.
చదువరిగారూ,
సామల రమేష్ బాబుగారు చెప్పిన మాటలకి అర్ధం ఏమిటంటే, "తెలుగులో ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యకుండా తెలుగుని పట్టించుకోకుండా ఇంగ్లీషుని యధేచ్ఛగా వాడేస్తూ తెలుగు తెలుగని గగ్గోలు పెట్టడమే కొందరికున్నజబ్బు " అని.
మిత్రులారా,
నేను రాసినదాంట్లో ఆంగ్లాభిమానం లేదు. తెలుగంటే దురభిమానం కూడా లేదు.
మన మిత్రులు వాస్తవాన్ని గుర్తించకుండా గాల్లో కత్తి తిప్పుతున్నారనే ఆవేదన వుంది.
ప్రణవి గారు మీరు బాగానే చెప్పారు, కాని ఇక్కడ విషయం ఏమిటంటే ఆంగ్ల భాష మీద వున్నా మమకారం మన తెలుగు భాష మీద ఎందుకు లేదనే. అలాగే మీరు చెప్పినట్లు గా పబ్లిక్ గార్డెన్స్ ని తెలుగు లో ఏమంటారో తెలుసుకుని వాడమన్నారు. చాలా సంతోషం, మీకు తెలుగు భాష ఫై ఆ మాత్రం అభిమానం వున్నందుకు. ఇక్కడ దురదృష్టకరమైన విషయమేమంటే పబ్లిక్ గార్డెన్స్ కి తెలుగు లో పేరు పెట్టలేదు. ఇదే మనకున్న జబ్బు. అలాగే ఇదే ఇంగ్లీషుని యధేచ్ఛగా వాడేస్తూ తెలుగు తెలుగని గగ్గోలు పెట్టడానికున్న వున్నా అసలు కారణం.దయచేసి గమనించగలరనిమనవి చేస్తున్నాం.
ReplyDeleteమధుగారూ,
ReplyDeleteనేను రాసిందాంట్లో ఆంగ్ల భాషమీద మమకారం గనక కనిపిస్తే దాన్ని నిరూపించడం మీ కనీస బాధ్యత. ఒకవేళ మీరు సాధికారికంగా నిరూపిస్తే, నేను మీ ముగ్గురికీ బహిరంగంగా క్షమాపణలు చెబుతాను. సరేనా ?
_ ప్రణవి.
telugupalaka.com
ReplyDelete