తెలుగు వారికి అంతర్జాలం (ఇంటర్నెట్) ఇంకా బాగా ఉపయోగపడాలంటే 'ఎన్‌కోడింగ్ స్టాండర్డైజేషన్' జరగాలి. హైదరాబాద్‌లో గత శనివారం ఇదే మొదటిసారిగా ఇంటర్నెట్‌కి, తెలుగు భాషకి గల సంబంధంపై సదస్సు జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, సిలికానాంధ్ర ఉమ్మడిగా నిర్వహించిన ఈ సదస్సులో తెలుగు భాషకు 'యూనికోడ్' రూపొందించే కృషి గురించి విపులంగా చర్చ జరిగింది. అనేక సంస్థలు ఈ దిశగా ఎంతో కృషి పరిశోధనా పరంగా చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి పట్టకపోవడంతో సమన్వయ లోపం వల్ల ఆ కృషి ఎక్కడిదక్కడే ఉండిపోతోంది. ఒక ఫాంట్‌లో టైప్ అయిన విషయం మరో ఫాంట్‌లోకి పోదు కాబట్టి అదే కంప్యూటర్‌లో చూసుకోవాలి. లేదా అదే ఫాంట్‌లో ఓపెన్ చేయాలి. ఈ సమస్య వల్ల 'అంతర్జాలం' అన్నది తెలుగు భాషకు అంతగా ఉపయోగపడకపోగా సమాచార మార్పిడి సమస్య ఘోరంగా ఉంది. తెలుగుకు ఉన్న ఈ సమస్య ఇంగ్లీషుకు లేదు. ఇ మెయిల్‌లో పంపిన తెలుగు మేటర్ ప్రింట్ తీసుకొని తిరిగి కంపోజ్ చేసుకోవలసిన దుస్థితి ఉంది. ప్రోగ్రామింగ్ సహకరించకపోవడం వల్ల ఇలా జగుగుతోంది. ఇక్కడ సమయం వృధా అవుతోంది. అట్లాస్ ష్రగ్డ్‌అని ఇప్పటి ప్రపంచాన్ని ముద్దుగా పిలుచుకుంటున్నాము. కాని తెలుగు భాషకు సంబంధించినంత వరకు కంప్యూటరైజేషన్ సౌలభ్యం చాలా పరిమితంగా ఉండి ఇంకా అట్లాస్ ఎక్స్‌పేండెడ్‌గానే పడి ఉంది. యూనికోడ్‌ను (ఏ ఫాంట్‌నైనా ఇందులోకి కన్వర్ట్ చేయవచ్చు) రూపొందించే కృషికి సమన్వయ లోపాన్ని పూడ్చడం కోసం సిలికానాంధ్ర ముందుకు వచ్చిందని దాని ప్రతినిధి శ్రీ కూచిభొట్ల ఆనంద్ సాహితీ గవాక్షానికి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. 'ఎన్‌కోడింగ్ స్టాండర్డైజేషన్' జపాన్, చైనా తుదకు మంగోలియా భాషలకు కూడా జరిగిందని చెప్పారు. దీనికి ముఖ్యం ఫాంట్ కన్వర్టర్ అని వివరించారు. అనేక సంస్థలు సాగిస్తున్న పరిశోధనా ఫలితాలకు అనుసంధాన కర్తగా, సమన్వయ కర్తగా వ్యవహరించడానికి సిలికానాంధ్ర ముందుకు వస్తున్నదని తెలిపారు. 'అంతర్జాలాని'కి ప్రామాణిక తెలుగు ఉంటే బాగుంటుందని ఆయన చెబుతూ ఇందుకు సాంకేతిక పరంగా ఇంగ్లీషుకున్న సౌలభ్యం తెలుగుకు లేదని చెప్పారు. తెలుగుకు అనేక వాడుక భాషలు, యాసలు, మాండలికాలు ఉన్నట్టుగా ఇతర భాషలకు కూడా ఉన్నప్పటికీ ఇంగ్లీషువంటి విదేశీ భాషలకి ప్రామాణిక భాషలు కూడా నిర్దిష్టంగా ఉండడంతో ఇంటర్నెట్ పదజాలం ఆయా భాషలకు ప్రత్యేకంగా రూపొందిందని వివరించారు. తెలుగువారు కూడా ప్రామాణిక భాషను అంతర్జాలంలోకి తేవాలని సూచించారు. ఆ దిశగా కృషి చేద్దామని అన్నారు. కేవలం భాషకోసం ఇన్ని లోపాలు భరించే బదులు ఇంగ్లీష్ ఇంటర్నెట్ భాషని మనంకూడా వర్తింపజేసుకుంటే తప్పేమిటి అని అడగ్గా -అప్పుడు కొంతకాలానికి ప్రపంచంలో ఒక్క ఇంగ్లీషు తప్ప ఇంకే భాష మిగలదు. సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రత్యేకతలు అన్ని భాషతో ముడిపడి ఉంటాయి. భాష మాయమైతే అవన్నీ పోయి సంస్కృతి రీత్యా ప్రపంచం అంతా ఒకేరకంగా మిగులుతుంది. కాబట్టి భాషా పరంగా అలా చేస్తే ఆత్మహత్యా సదృశ్యమౌతుందని ఆనంద్ చెప్పారు. రెండేళ్లలో తెలుగులో యూనికోడ్ సాధ్యమౌతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎందుకంటే యూనికోడ్ దిశగా అనేక సంస్థలు సాగిస్తున్న పరిశోధనలు పురోగతి సాధించినా సమన్వయకర్త లేకపోవడం వల్ల అవి వెలుగులోకి రావడం లేదని ఆయన చెప్పారు. ఇంటర్నెట్ మంచి కంటే చెడుకు ఎక్కువ ఉపయోగపడుతోంది కదా అని అడగ్గా, అందుకు సాంకేతిక పరిష్కారం ఉన్నప్పటికీ దానికి ప్రత్యామ్నాయాలు కూడా విరివిగా వస్తున్నాయని చెప్పారు. ఉదాహరణకి చైనా అంతర్జాలంనుంచి బూతుని నిషేధించినట్లు చెప్పుకొంటోంది కానీ వాస్తవానికి అక్కడ కూడా పరిమితులు లేవని చెప్పారు. ఇది సాంకేతికంగా వీలుకాదని వివరించారు. ఎందుకంటే నిషేధానికి ముందు నిర్వచనం సిస్టంకి లోడ్ చేయాలని, ఆ నిర్వచనం ప్రకారం మన ప్రాచీన గ్రంథాలు, అన్నమయ్య పాటలు అన్నీ కూడా 'నాట్ యాక్సస్‌బుల్' అవుతాయని చెప్పారు. ఎంతో సృజనని భావితరాలు ఆ విధంగా కోల్పోతాయని వివరించారు. సదస్సులో పాల్గొన్న శ్రీ మండలి బుద్ధప్రసాద్‌ను అంతర్జాలానికి మాండలికాల మధ్య పరివర్తన సాధించి కొత్త మాండలిక సమ్మిశ్రమాన్ని రూపొందించే బదులు ప్రామాణిక భాషనే వాడుకుంటే బాగుంటుంది కదా అని సాహితీగవాక్షం ప్రశ్నించింది. అందుకాయన భాష సుసంపన్నం కావాలంటే మాండలికాలని కూడా గ్రహించాలని, ఇప్పుడు ఈ సదస్సులాంటివి జరుగుతున్నది అందుకేనని వివరించారు. మాండిలికాల పరిరక్షణలో భాగంగా ప్రత్యేక అంతర్జాల భాష సృష్టికి కృషి సాగాలని చెప్పారు. ట్రిపుల్ ఐటిలలో తెలుగు భాష సంస్కరణకు సాగుతున్న కృషిని ఈ సదస్సులో వక్తలు వివరించారు. ఉదాహరణకి హైపర్ టెక్ట్స్ అంటే అధిపాఠం. హైపర్ మీడియా అంటే అధిమాధ్యమం, వర్డ్ ఫైల్ అంటే శబ్దదస్తరం.
కంప్యూటర్‌ని సంగణక అనమంటున్నారు. ఆటోమేటిక్ పదానికి స్వయంచాలక వాడమంటున్నారు. హైపర్ గ్రామర్ పదానికి అనువాద పదం అభివ్యాకరణం. సాంకేతిక పదం బదులు తంత్ర అనమంటున్నారు. క్రియేషన్ ఆఫ్ వర్డ్‌ని పదజనకం అని పేర్కొంటున్నారు. సంగణక ద్వారా అనువాదం చేస్తే యంత్రానువాదం అనే పదం సరిపోతుందని చెపుతున్నారు. డయలక్ట్ కన్వర్షన్‌కు మాండలిక పరివర్తన అనే పదాన్ని సృష్టించారు. ప్రస్తుతానికి ఇంటర్నెట్‌ను వాడుకోడానికి మనకి అడ్డంకులేమీ లేవు. భాష ఒక్కటే అడ్డంకిగా మేధావులు ఎందుకు భావిస్తున్నారంటే ఇంగ్లీషు పదాలకి సమానార్థకాలు అవసరమని భావించడం వల్ల. పైన పేర్కొన్న ఇంగ్లీషు బదులుగా వాడమంటున్న పదాలు భాషని ఏ మాత్రం రక్షిస్తాయో మేధావులే చెప్పాలి. అసలు ఇంటర్నెట్‌ను అంతర్జాలం అనకపోతే కొంపలు మునుగుతాయా? అని సామాన్యులు తప్పనిసరిగా ప్రశ్నిస్తారు. అయితే మేధావులు చెబుతున్నది ఏమిటంటే -ఇంటర్నెట్ ఉధృతికి తక్కిన భాషలన్నీ కొట్టుకుపోతాయని. అలా జరక్కుండా ఉండాలంటే అంతర్జాలాలు, పదజనకాలు తప్పనిసరిగా సృష్టించాలని. మొత్తానికి ఇదే తొలిసారిగా నగరంలో శనివారం జరిగిన 'అంతర్జాల సదస్సు' మేధావులని ఆలోచింప చేసింది. ఇంటర్నెట్‌ను ఇంగ్లీషుకి వదిలేయకుండా మన తెలుగువారు పూర్తిగా సొంతం చేసుకోవాలంటే పరిశోధనలు ఆ దిశగా ఎన్నో సాగాలి. ప్రస్తుతం సాగుతున్న పరిశోధనల ఫలితాలు జనాన్ని చేరాలి. తెలుగు భాష మృతభాష కాకుండా ఉండాలంటే ఇంటర్నెట్‌ను కూడా తెలుగుపరం చేయాల్సిందే. ఇందుకు సాగుతున్న కృషిని సమన్వయపరచడానికి సిలికానాంధ్ర ముందుకు వచ్చినందుకు స్వాగతిద్దాం.

- పురాణం శ్రీనివాస శాస్త్రి
(ఆంధ్రప్రభ దినపత్రిక సౌజన్యంతో..)
Interesting.
ReplyDelete