హైదరాబాదులోని ట్యాంకుబండ్ ఫై తెలంగాణా వాదులు గురువారం చేపట్టిన మిలియన్ మార్చ్ లో అక్కడి తెలుగు మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేయడం అత్యంత దారుణమైన హేయమైన చర్య! శ్రీకృష్ణదేవరాయలు , అన్నమయ్య, బ్రహ్మనాయుడు, శ్రీశ్రీ, త్రిపురనేని రామస్వామి చౌదరి తదితర తెలుగు ప్రముఖుల విగ్రహాలను ధ్వంసం చేసి తెలుగుజాతి ఔన్నత్యాన్ని మంటగలిపారు. ప్రభుత్వాలూ, నేతల అసమర్థ వైఖరుల కారణంగానే తెలంగాణా సమస్య జటిలమైంది. ఇలాంటి సంఘటనల వల్ల ఎంతో బలీయమైన తెలుగుజాతి ప్రపంచం దృష్టిలో చులకనైపోయింది. ట్యాంకు బండ్ పై విగ్రహాలను ద్వంసం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మిలియన్ మార్చ్ సందర్భంగా మీడియా ప్రతినిధులపై,వాహనాలపై కూడా దాడి జరగడం శోచనీయం. తెలంగాణా సమస్యకు పరిష్కారాన్ని కనుగొనలేక పోయిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలే ఇలాంటి ఘటనలకు బాధ్యత వహించాలి. రాష్ట్రం రావణకాష్టం కాకుండా చూడాలి.
Sonia is responsible for this mess.
ReplyDeleteఇది చాలా ఘోరం ఆ జాక్ చైర్మన్ కొదండ్ రామ్ ని అసలు తన ఉద్యోగం చేస్తున్నాడా లేక ఉద్యమాలు చేస్తున్నాడా , ప్రబుత్యం జీతం తీసుకుంటూ ప్రబుత్యానికి వ్యేతిరేకంగా పని చేస్తున్నాడు
ReplyDelete--ఓ తెలుగు ముద్దు బిడ్డ
Would this incident have happened if the rulers treated Telangana people & culture with due respect? How many Telangana statues are there in RK beach or anywhere else in andhra?
ReplyDelete