తెలుగుసాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2009కి గాను శుక్రవారం సాహితీ పురస్కారాలు ప్రకటించింది. విజేతలకు ఈ నెల 31న వర్సిటీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాలు అందజేస్తారు. రచయితలను రూ.20,116 నగదు, ప్రశంసాపత్రంతో సత్కరిస్తామని విశ్వవిద్యాలయం ఉపకులపతి అనుమాండ్ల భూమయ్య తెలిపారు.
పద్య కవితా పురస్కారం: పురుషోత్తముడు, -చిటిప్రోలు కృష్ణమూర్తి
ఉత్తమ వచన కవితా సంపుటి: భరోస, -డా.అమ్మంగి వేణుగోపాల్
కథల సంపుటి: గజ ఈతరాలు, -గొరుసు జగదీశ్వరరెడ్డి
నవల: మునెమ్మ, -డా.కేశవరెడ్డి
సాహిత్య విమర్శ గ్రంథం: 'సంవిధానం' -గుడిపాటి
నాటకం: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, -డాక్టర్ వి.ఆర్.రాసాని
అనువాద పురస్కారం: ప్రేంచంద్ బాలసాహిత్యం పదమూడు కథలు,- ఆర్.శాంతసుందరి
వచన రచన: ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ, -డా.గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి
రచయిత్రుల గ్రంథాలు: తెలుగుధనం, -డా.తుర్లపాటి రాజేశ్వరి.
No comments:
Post a Comment